ప్రజాశక్తి- అడ్డతీగల(అల్లూరిజిల్లా) : అడ్డతీగల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆర్టీసీ బస్సు ఢకొీని వృద్ధురాలు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన బోరా రాఘవమ్మ (83) తిమ్మాపురం నుండి ఏలేశ్వరం వెళ్ళడానికి బస్‌స్టాండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఏలేశ్వరం నుండి వైరామవరం వెళుతున్న బస్సు ప్రయాణికులు దింపడానికి ఆగింది. బస్సు ఎక్కెందుకు వెళుతుండగా అది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనించడంతో బస్సు టైర్ల కిందపడి రాఘవమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకన్న ఎస్‌ఐ అప్పలరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










