
ఇంటర్నెట్‌డెస్క్ : సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని వింతలు విశేషాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు బైక్‌పై స్టంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ తాత ఎక్కడీ ఎప్పుడు చేశాడనే సమాచారం లేదు. కానీ ఈయన చేసిన విన్యాసాల్ని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వృద్ధుడు హ్యాండిల్‌ని వదిలిపెట్టి కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గకుండా.. పైకి లేవడం.. పడుకోవడం.. జాలీగా ఎంజారు చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేశారు. తాతగారికి ఈ వయసులో ఇలాంటి స్టంట్స్ అవసరమా? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొక నెటిజన్ పొరపాటున బైక్ పై నుంచి కింద పడితే ఎంత ప్రమాదం అంటూ కామెంట్స్ చేశారు.
इन्हीं हरकतों की वजह से सरकार ने पुरानी पेंशन योजना बंद की है। 😅 pic.twitter.com/9On89AL5SJ
— Ankit Yadav Bojha (@Ankitydv92) August 13, 2023