
ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్యజిల్లా) :ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్‌ఐ తిప్పేస్వామి సూచించారు. మంగళవారం మండలంలోని కదిరాయ చెరువు పంచాయతీలోని వివిధ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు ప్రమాదాలు నివారించు కోవాలంటే హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగలకుండా ఉండేందుకు హెల్మెట్ ఎంతో సహాయపడుతుందని తద్వారా ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా గాయాలయి త్వరగా కోలుకుండేందుకు అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఈ మధ్యకాలంలో ప్రమాదాలలో మరణించేవారు ఇంచుమించు హెల్మెట్ లేకపోవడం వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా పోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని దీనిని గుర్తించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. తలలో ఉన్న సున్నితమైన అవయవం మెదడు ఈ మెదడు దెబ్బ తినకుండా ఉంటే మిగిలిన శరీర భాగాలు గాయాలైన కోలుకునేందుకు వీలుగా ఉంటుందని, కాబట్టే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రమేష్, డ్రైవర్ రమేష్, మహిళా పోలీస్ గిరిజ, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు.