ఆమె ప్రతి సూర్యోదయాన
పెరట్లో నిల్చొని పైకి చూస్తోంది
తనపైన పూలపందిరి ఉంది..
నీలాకాశమూ ఉంది..
ఎదురుగా బాల్కనీలో నేను
నిశ్శబ్దకంఠ స్వరంతో ఇలా అడిగాను
ప్రతిరాత్రీ కలలోకి వస్తావెందుకని..?
జరగనివన్నీ కలలోనే చూస్తామంది
బదులుగా.. సత్యం బోధపడేలోగా
మబ్బుల్లోకి జారుకుంది.
లోసారి సుధాకర్
994996991