Oct 30,2023 12:12

 ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భఘెల్‌
రాయ్  పూర్‌ : 
ఎన్నికల్లో 'నోటా' ఆప్షన్‌పై ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భఘెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నోటా'ను తీసేయాలన్నారు. ఆ ఆప్షన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం 2013లో ఈవీఎంలపై నోటాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నోటాపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. '' కొన్ని సందర్భాల్లో గెలుపు, ఓటముల (ఇద్దరు అభ్యర్థుల మధ్య) కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోల్‌ అవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ దీనిపై దృష్టి సారించాలి'' అని రారుపూర్‌లో నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన అన్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఎన్నికలు నవంబర్‌ 7, 17 తేదీలలో రెండు దశల్లో జరగనున్నాయి.