Oct 29,2023 08:04

ముంబయి : సోషల్‌ మీడియా పోస్టులను లైక్‌ చేసే విషయంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 67 ప్రకారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ను లైక్‌ చేయడం నేరం కాదని బాంబే హైకోర్టు తెలిపింది. అయితే, అటువంటి పోస్ట్‌లను షేర్‌ చేయడం లేదా రీట్వీట్‌ చేయడం నిబంధన ప్రకారం ''వ్యాప్తిచేయటం (ట్రాన్స్‌మిషన్‌)'' అని స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్‌ 67 ఎలక్ట్రానిక్‌ రూపంలో అశ్లీల విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేసే శిక్షను వివరిస్తుంది. 500 మందికి పైగా ముస్లింలు పర్మిట్‌ లేకుండా ఊరేగింపు కోసం సమావేశమయ్యేలా సోషల్‌ మీడియా పోస్ట్‌లు చేసినందుకు తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ మొహమ్మద్‌ ఇమ్రాన్‌ కాజీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు పై విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.