Oct 20,2023 19:30

గాయని సునీతతో తనకు ఎలాంటి విభేదాల్లేవని మరో గాయని ఉష స్పష్టంచేశారు. 'చిత్రం' సినిమాతో ఆమె నేపథ్య గాయనిగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఎన్నో ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో గీతాలు ఆలపించారు. 'నువ్వు నేను', 'నువ్వు లేక నేను లేను', 'మనసంతా నువ్వే', 'నీ స్నేహం', 'సంతోషం' 'ఇంద్ర', 'దిల్‌' వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. సునీతతో విబేధాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఈ విధంగా స్పందించారు. 'మా మధ్య మంచి అనుబంధం ఉంది. కలిసి పోగ్రామ్స్‌ కూడా చేశాం. అమెరికా వెళ్లిన తర్వాత నేను ఎవరితోనూ టచ్‌లో లేను. దాంతో మా మధ్య గొడవలు అయ్యాయంటూ వదంతులు సృష్టించారు. ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను. గతంలో ఇలాగే వార్తలు వస్తే నేను క్లారిటీ కూడా ఇచ్చా. మా మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఇటీవల మేమిద్దరం కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా చేశాం' అని వెల్లడించారు.