జపాన్ చిత్రానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సైతం సామాజిక మాధ్యమాల్లో పెట్టద్దని హీరో కార్తి కోరారు. చెన్నైలోని ఓ ధియేటర్లో అభిమానులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. జపాన్ చిత్రాన్ని రాజు మురుగన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. బంగారం దోపిడీచేసే దొంగ పాత్రలో కార్తి నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. 'సినిమా పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. అభిమానులు కూడా బాగా ఎంజారు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను దయచేసి పోస్టులు పెట్టద్దు' అంటూ కార్తి కోరారు.