
ప్రజాశక్తి - వాల్మీకిపురం (అన్నమయ్య) : ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం విజయదశమిని పురస్కరించుకొని స్థానిక సత్యసాయి నగర్లోని సత్యసాయిబాబా గుడిలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారికి మనసు మార్చాలని, వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నిర్మల, సర్పంచ్ గంగులమ్మ, నాయకులు నీళ్ల భాస్కర్, కేశవ రెడ్డి, సైఫుల్లా, రాయుడు, షాహిద్, ఇర్ఫాన్, రవి, రమేష్, మునిభాస్కర్, ఆనంద, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.