మూడు కాలాలు
ఏచట దాగెనో కోయిల
వసంత రాగమై వచ్చింది.
రెక్కలు తెగితెనేం
పక్షి కూడగట్టుకుని
నింగిని ముద్దాడింది .
మోడుబారిన చెట్టు
ఆశగా చిగురించెను చూడు.
గాలి కత్తై సాలెగూడును
తెగ్గొట్టినా దాని
హృదయ సౌందర్యం
ఎంత కళాత్మకంగా
ఉందో చూడు.
అల అవిశ్రాంత పోరాటమే
దాని కల.
లక్ష్యమంటు నీలో ఉంటే
ప్రయత్నమంటు
నీలో మొదలైతే
చైతన్యం నీలో చిగురులేస్తే
ఓటమెటో పారిపోదా!
గమ్యమేదో తెలిసి రాదా !
విజయమదే వలచి రాదా !
ప్రకృతే నీకు పాఠం.
జాగృతే నీ చలన సూత్రం.
శ్రమ నీ ఆయుధం.
సంకల్పమే
నీ సామ్రాజ్యం.
ఎడారి అయినా పుష్పించును.
నింగి అయినా తలవంచును.
కాలమే నీ కనుచూపై కదులును.
- బొందిలి విజయలక్ష్మి
94414 36684