Oct 16,2022 08:50

చీకట్లను తరిమి
వెలుగు పొద్దు పొడిచింది
నిశ్శబ్దాలు ఉరిమి
నిజాల మెరుపు మెరిసింది
నిద్రిస్తున్న బాధ్యతలను
తట్టి లేపింది
మౌన మేఘం
జ్ఞాన వెలుగు కురిసింది
వెలుగు వివేకం నింపింది
వివేక వాణి పలికింది
ప్రజా గొంతు విప్పింది
ప్రభాతం
ఉదయ ద్వారం తీసింది
చీకట్ల చివరలకు
వివేక రష్మి సోకింది
ధైర్యానికి దారి చూపింది
అజ్ఞానాల
అంధకారం తొలగింది
విజ్ఞానాల
సుజ్ఞానం వెలిగింది.

పి.బక్కారెడ్డి
97053 15350