కృష్ణాజిల్లా : ఉద్యోగులకు ఎదురవుతున్న పి.ఎఫ్ సమస్యల్ని తీర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా అధికారులు పి.ఎఫ్ మీ ముంగిట కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాల వారీగా.. ప్రతినెలా 27వ తేదీన జరిగే ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ఉద్యోగుల పిఎఫ్ సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నెల ఈ కార్యక్రమం కృష్ణాజిల్లాలో అడవినెక్కలలో కుశాలవ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా నోడల్ అధికారి పి. జవహర్‌లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎఫ్ నామినేషన్ ఆవశ్యకత, పిఎఫ్ మెంబర్ సర్వీస్‌ల ఉండగా మృతిచెందితే.. మృతుని కుటుంబ సభ్యులు ఏవిధంగా ప్రయోజనం పొందవచ్చో జవహర్‌లాల్ వివరంగా తెలియజేశారు. వై.గోపాలరావు (డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొండేపూడి శ్రీనివాసరావు, శివశంకర్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ల










