Oct 01,2023 13:16

       ఇన్‌స్టంట్‌ మల్టీమీడియా మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌ తర్వాత, టెలిగ్రామ్‌లో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. టెలిగ్రామ్‌ ప్రీమియం వినియోగదారుల కోసం స్టోరీస్‌ అనే ఫీచర్‌ను జూలైలో ప్రారంభించగా, ఆగస్టులో అందరికీ విడుదల చేసింది. ఈ సరికొత్త ఫీచర్‌ ద్వారా టెలిగ్రామ్‌ వినియోగదారులు ఫేస్‌బుక్‌ స్టోరీస్‌ మాదిరిగా దీనిలోనూ సంగీతాన్ని జోడించవచ్చు. ఇది కాకుండా, స్టోరీస్‌కు రకరకాల స్టిక్కర్స్‌ను కూడా జోడించవచ్చు.
        ఇదే కాకుండా, టెలిగ్రామ్‌ వినియోగదారులు ఇప్పుడు వ్యూస్‌ మోడ్‌లో ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవచ్చు. స్టోరీలను టెలిగ్రామ్‌ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లాగా టెలిగ్రామ్‌ స్టోరీలను కూడా 6, 12, 24, 48 గంటల పాటు అప్‌డేట్‌ చేయవచ్చు. టెలిగ్రామ్‌ ప్రీమియం వినియోగదారులు స్టోరీలను ఎక్కువగా పోస్ట్‌ చేయడంతో పాటు ప్రచారం చేయవచ్చు. అంతేగాకుండా.. టెలిగ్రామ్‌ ఛానెల్‌ని మెరుగుపరచడానికి చిట్కాలను కూడా ఇస్తుంది. దీనికోసం ఛానెల్‌ సమాచారంలోని బూస్ట్‌ల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఉచిత టెలిగ్రామ్‌ వినియోగదారులు స్టిక్కర్‌ కథనాలపై ఒకరోజులో ఒక కథనానికి ఒక స్పందన మాత్రమే ఇవ్వగలరు. అదేే ప్రీమియం వినియోగదారులైతే.. ఐదుసార్లు స్పందించేందుకు అవకాశం ఉంటుంది. కథలకు సంగీతాన్ని జోడించడానికి, మీరు మీ ఫోన్‌ గ్యాలరీ సహాయం తీసుకోవచ్చు.
         కొత్త అప్‌డేట్‌ తర్వాత, వినియోగదారులు లాగిన్‌ అయిన ప్రతిసారీ టెలిగ్రామ్‌ వారికి హెచ్చరికను పంపుతుంది. కంపెనీ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా విడుదల చేసింది.