Jun 25,2023 16:08

గూగుల్‌ మ్యాప్‌ తన వినియోగదారుల ట్రావెల్‌ప్లాన్‌ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలోని గ్లాన్సబుల్‌ డైరెక్షన్స్‌ అనే ఫీచర్‌ ద్వారా లాక్‌ స్క్రీన్స్‌పై, రూట్‌ ఓవర్‌ వ్యూపై కూడా ట్రావెల్‌ ప్రోగ్రెస్‌ను తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవడం ద్వారా గమ్యస్థానానికి చేరే మార్గాలను, రూట్‌ ప్రోగ్రెస్‌ను, రూట్‌లో వచ్చే టర్నింగ్స్‌ గురించి ముందుగానే తెలియజేస్తుంది. గతంలోనూ ఈ ఫీచర్‌ వున్నప్పటికీ.. అది ఫుల్‌ నేవిగేషన్‌ మోడ్‌లో వున్నప్పుడు మాత్రమే అందుబాటులో వుండేది. ఇప్పుడు లాక్‌ స్క్రీన్‌పైకి తీసుకొచ్చారు. అంతేకాదు.. ప్రయాణం వివరాలను తెలపడానికి ఇటీవల ప్రయాణించిన వివరాలను కూడా వినియోగదారులకు అప్‌డేట్‌ చేస్తుంది. ఈ తాజా అప్‌డేట్‌ వల్ల గూగుల్‌ మ్యాప్స్‌ విండోను క్లోజ్‌ చేసినప్పటికీ వినియోగదారుడు వెళ్లిన మార్గాలన్నింటినీ ఆటోమేటిక్‌గా సేవ్‌ చేసి, భద్రపరుస్తుంది. అంతేకాకుండా.. ఆయా పర్యాటక ప్రాంతాలలో వేలాది ఫొటోలను కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా సాంకేతికత జోడించి, త్రీడీలో చూసే అవకాశం ఈ కొత్త ఫీచర్స్‌ ద్వారా కలుగుతుంది.