యూట్యూబ్ న్యూ క్రియేట్ యాప్ వీడియో క్రియేటర్ల కోసం ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ అదిరిపోయే ప్రకటన చేసింది. కొత్త యాప్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విధంగా డ్రీమ్ స్క్రీన్ అనే మరో కొత్త ఫీచర్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.
వీడియో ఎడిటింగ్ ఫ్రీ యాప్
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం అయిన యూట్యూబ్.. అందులో వీడియో క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పుడు వీడియోల్ని సులువుగా రూపొందించుకునేలా యూట్యూబ్ క్రియేట్ పేరుతో కొత్త యాప్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఎ1 (కత్రిమ మేధ) ఆధారంగా రూపొందించిన డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ కూడా టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని సాయంతోనే షార్ట్ వీడియోస్‌కు ఏఐ ఆధారంగా రూపొందించిన వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజెస్ జోడించేందుకు వీలుంటుంది.
మేడ్ ఇన్ యూట్యూబ్ పేరుతో గూగుల్.. ఇటీవల ఒక ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగానే యూట్యూబ్ క్రియేట్ యాప్ సహా డ్రీమ్ స్క్రీన్ గురించి ప్రకటించింది యూట్యూబ్. న్యూ జెనరేటివ్ ఏఐ ఆధారిత యాప్‌లో ఆటోమేటిక్ క్యాప్షనింగ్ ట్రాన్సిషన్స్, ఎడిటింగ్ ట్రిమ్మింగ్, వాయిస్ ఓవర్ వంటి ఫీచర్లు ఉంటాయి. టిక్‌టాక్ మాదిరిగానే బీట్ మ్యాచింగ్ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను కూడా వినియోగదారులు వాడుకోవచ్చు.
వీడియోల్ని క్రియేటివ్‌గా రూపొందించడం కష్టమని తమకు తెలుసని.. దాంట్లో కూడా మొదటిసారి వీడియో అప్‌లోడ్ చేయాలంటే.. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుందని యూట్యూబ కమ్యూనిటీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ తెలిపారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకే .. ఇంకా ఎవరైనా కూడా వీడియోల్ని క్రియేట్ చేసుకోవాలన్నా.. షేర్ చేయాలన్నా కూడా సులభంగ ఉండేందుకే ఈ అప్లికేషన్ రూపొందించినట్లు చెప్పారు.
ఇక ఇది ఫ్రీ యాప్ అని.. ప్రస్తుతం ఇది భారత్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, కొరియా, ఇండోనేసియా, సింగపూర్ సహా ఇతర ఎంపిక చేసిన మార్కెట్లలో ఆండ్రాయిడ్‌లో బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చే సంవత్సరం.. ఐఫోన్‌లో ఈ యాప్ ప్రవేశపెట్టనున్నట్లు యూట్యూబ్ తెలిపింది.