మధురత ఒలికించే అమ్మను
ఆప్యాయతను మాటల్లో పంచే నాన్నను
అనురాగాన్ని అధరాలలో పూయించే అన్నను
అనుబంధాన్ని పెంచే చెల్లిని
వెన్నెల ఆకాశం చంద్రుని
తలపించే తీపిగుర్తును
నలుగురినీ కలిపే నవ్వుల పువ్వును
చైతన్యాన్ని కలిగించే సూర్యకిరణాన్ని
మదిలో ఆవేశాన్ని రగిలించే నిప్పురవ్వను
విజయాన్ని నింపే అక్షయపాత్రను
తెలుగుదనాన్ని అణువణువున
చుట్టుకున్న వయ్యారాన్ని
నన్ను నేనే చెక్కుకునే శిల్పిని
కవుల హస్తాలలో కవిత్వంగా
ప్రవహించే నదిని
అక్షరాలు కొన్నైనా
సృష్టించే అనుంగు పుత్రికని
హరివిల్లును నేలన దింపిన సింగారాన్ని
పదం పదంలో ప్రకృతిని ఆవిష్కరించే కలం అనే అవనికన్నెను
తేనె కన్నా తీయనైన పలుకుని
ప్రేమకు భాష్యంగా నిలిచే స్వరూపాన్ని
మీ కళ్ళలో వెలుగే చెబుతోంది
నేను మన తెలుగు భాషనని..
భలే కనిపెట్టేసారే!
యలమర్తి అనూరాధ
92472 60206