విషం కక్కుతూ కషాయం సల్లుతుంటే
పుట్టేంటుకలిచ్చి
కందురు చేస్తామని మొక్కిన మొక్కుల్ని
ఏ కొండకు కట్టి రావాలి
అలైబలై జేసుకున్న
ఆప్యాతల ఉగాది పచ్చడి షర్బత్ కుండలను
ఏ రాయితో పగల్గొట్టుకోవాలి
బాల్యంలో కలిసి పూసుకున్న రంగుల్ని
ధూదిపీర్లకాడ కలిపిన దూలా స్టెప్పుల్ని
ఏ నదిలో పోసి రావాలి
కందొన్సే కంద కలుపుతూ
సరిహద్దు గోడై నిల్చిన భుజాల్ని
ఏ ఆయుధానికి ఇయ్యాలి
ఒక దగ్గర పంచుకున్న
ఉండ్రాళ్ళని, మలిద ముద్దల్ల్నీ
ఏ పొలిమేరలకు ఇసిరేయాలి
తల్లి పాలిండ్లకు పసరు పూసి
కన్నబిడ్డల మీద వివక్ష సూపిస్తే
ఏ గుడి ముందు చెయ్యి చాచాలి
ఈ దేశంలో పుట్టిన నెలవంక
పరాయిది ఎందుకైతది
ఈ విష గుళికల చాణిక్యఛాయల మధ్య
పిడికిలి బిగించి
జై భీమ్ అని గొంతెత్తి
కొత్త వెలుగు పాటను పాడుదాం.
జి.యం.నాగేష్ యాదవ్
9494893625