Jul 18,2023 21:28

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా మంగళవారం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై సిఎంతో రహేజా ప్రతినిధులు చర్చించారు. విశాఖలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి సిఎంను కె రహేజా గ్రూపు ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎపిఐఐసి మేనేజింగ్‌ డైరెక్టరు ప్రవీణ్‌కుమార్‌, కె రహేజా గ్రూపు ఆంద్ర, తెలంగాణ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరు జి శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.