Nov 19,2023 09:09

అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆ ఊరిలో అందరూ ఎక్కువగా ప్లాస్టిక్‌ వస్తువులను వాడుతూ, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉండటం అతనికి చాలా బాధ కలిగించేది. ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలాగైనా తగ్గించాలన్న ఉద్దేశంతో ఊరి జనంతో, పెద్దలతో చాలాసార్లు మాట్లాడినా పట్టించుకునేవారు కాదు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని తన స్నేహితుడైన పోలీస్‌ సహాయంతో ఒక ప్లాస్టిక్‌ వ్యర్థాలతో భూతం ఆకారంలో తయారుచేసి, ఆ ఊరి మధ్యలో ఉంచాడు. అది ఎంతో భయంకరంగా కనిపించడంతో జనాలు భయాందోళనకు లోనయ్యారు. దాంతో తాము వాడుతున్న ప్లాస్టిక్‌ ఎంత ప్రమాదమో తెలుసుకున్నారు. అప్పటి నుంచి ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకుని, ప్లాస్టిక్‌ వ్యర్థాన్ని సరైన విధంగా రీ సైకిలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ప్రకృతిని రక్షిస్తే.. తిరిగి ప్రకృతి మానవాళిని రక్షిస్తుంది.