విలక్షణ నటుడు నాజర్‌కు తండ్రి మాబూబ్ బాషా (95) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. తండ్రి మరణంతో నాజర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.










