Oct 24,2023 16:36

''పలాస'' ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన సినిమా ''నరకాసుర''. అపర్ణ జనార్థన్‌, సంకీర్తన విపిన్‌ హీరోయిన్స్‌ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిలిం మేకర్స్‌ బ్యానర్స్‌ లో డాక్టర్‌ అజ్జా శ్రీనివాస్‌ నిర్మించారు. సెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మళయాల, కన్నడ భాషల్లో ''నరకాసుర'' మూవీ రిలీజ్‌ కాబోతోంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ ను స్టార్‌ హీరో నాగశౌర్య చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నటుడు సలీమ్‌ ఫేకు మాట్లాడుతూ - ''నరకాసుర'' సినిమాలో రక్షిత్‌ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఈ సినిమాకు చూపించిన డెడికేషన్‌ కు హ్యాట్సాఫ్‌. అలాగే డైరెక్టర్‌ సెబాస్టియన్‌ కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను తెరకెక్కించాడు. జబల్‌ పూర్‌, వైజాగ్‌ వంటి అనేక లకేషన్స్‌ లో షఉటింగ్‌ చేశాం. సీన్స్‌, సాంగ్స్‌ చాలా బాగుంటాయి. గతంలో సూర్య వర్సెస్‌ సూర్య, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, జాతిరత్నాలు సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌ చేస్తే ఈ సినిమాలో నేను ఇంపార్టెంట్‌ రోల్‌ చేశాను. ''నరకాసుర'' అద్భుతమైన సినిమా. మీరంతా తప్పకుండా చూడాలి' అని అన్నారు.
నటుడు సుజిత్‌ మాట్లాడుతూ - ''నరకాసుర'' మూవీలో నాకు ఒక మంచి రోల్‌ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ సెబాస్టియన్‌ కు థ్యాంక్స్‌. నా క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది. ఆ సస్పెన్స్‌ ఇప్పుడు చెప్పలేను. ఇండియాలోని ఇంపార్టెంట్‌ లకేషన్స్‌ లో షఉటింగ్‌ చేశాం. అన్ని రకాల ఎమోషన్స్‌ తో సినిమా ఆకట్టుకుంటుంది. మా టీమ్‌ అందరికీ స్పెషల్‌ మూవీ అవుతుంది.'అని అన్నారు.
నిర్మాత డాక్టర్‌ అజ్జా శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''నరకాసుర'' సినిమా టీమ్‌ నుంచి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతున్నాం. మా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో నాగశౌర్య గారికి థ్యాంక్స్‌. హీరో రక్షిత్‌ మూడేళ్లు హార్డ్‌ వర్క్‌ తో ''నరకాసుర'' సినిమాలో అద్భుతంగా నటించారు. నాజర్‌, చరణ్‌ రాజ్‌, శ్రీమాన్‌ వంటి సీనియర్‌ యాక్టర్స్‌ మంచి క్యారెక్టర్స్‌ చేశారు. డైరెక్టర్‌ సెబాస్టియన్‌ డెడికేషన్‌ తో సినిమా చేశారు. నవంబర్‌ 3న థియేటర్స్‌ లో ''నరకాసుర'' సినిమా చూడమని కోరుతున్నా' అని అన్నారు.
హీరోయిన్‌ సంకీర్తన విపిన్‌ మాట్లాడుతూ - ''నరకాసుర'' సినిమా పవర్‌ ప్యాక్డ్‌ గా ఉంటుంది. ఇందులో ఎన్నో సర్‌ ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌, క్యారెక్టర్స్‌ ఉంటాయి. థియేటర్స్‌ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సినిమా అవుతుంది. మా సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్‌ చేసిన టీజర్‌, సాంగ్స్‌ కు మంచి రెస్పాన్స్‌ ఇచ్చారు. ఇవాళ రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ తో పాటు మూవీకి కూడా మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా ' అని అన్నారు.
డైరెక్టర్‌ సెబాస్టియన్‌ మాట్లాడుతూ - మా సినిమా ఈవెంట్‌ కు వచ్చిన శౌర్య గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా జర్నీలో రక్షిత్‌ నాకు రైట్‌ హ్యాండ్‌ లా ఉండి సపోర్ట్‌ చేశాడు. అలాగే మా ప్రొడ్యూసర్స్‌ ఎంతో సపోర్ట్‌ ఇచ్చారు. సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వస్తుందని వారికి నేను నమ్మకంగా చెబుతున్నాను. ''నరకాసుర'' ప్రతి ఫ్రేమ్‌, సీన్‌, ప్రతి అంశంలో కొత్తగా ఉంటుంది. మేము కొత్త ప్రయత్నం చేశాం అని ఈ సినిమాతో ప్రూవ్‌ చేసుకోవాలని అనుకుంటున్నాం. సినిమా ట్రైలర్‌ కమర్షియల్‌ గా ఉండాలని కట్‌ చేశాం గానీ ఫస్టాఫ్‌ లో ఫుల్‌ కామెడీ ఉంటుంది. శ్రీమాన్‌, ఫిష్‌ వెంకట్‌, సలీమ్‌ కాంబినేషన్స్‌ సీన్స్‌ బాగా నవ్విస్తాయి. భరత్‌ అనే నేను సినిమా ఈవెంట్‌ లో కేటీఆర్‌ గారు మాట్లాడుతూ ట్రాన్స్‌ జెండర్స్‌ ను సినిమాల్లో కమర్షియల్‌ గా చూపిస్తున్నారు. అలా కాకుండా వాళ్ల ప్రాబ్లమ్స్‌ తో ఒక సినిమా చేస్తే బాగుంటుందని సూచించారు. అది నాకు బాగా నచ్చింది. నా చిన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్‌ కూడా గుర్తుండిపోయింది. వాటిని కలిపి ఈ కథలో ట్రాన్స్‌ జెండర్‌ అంశాన్ని పెట్టాం. అది సినిమాకు ఆకర్షణ అవుతుందని అనుకుంటున్నాం. సెకండాఫ్‌ డిఫరెంట్‌ గా ఉంటుంది. ''నరకాసుర'' థియేటర్స్‌ లో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది' అని అన్నారు.
నటుడు చరణ్‌ రాజ్‌ మాట్లాడుతూ - డైరెక్టర్‌ సెబాస్టియన్‌ ''నరకాసుర'' కథ చెప్పగానే ఈ సినిమా చేస్తానని ఆయన వెంట పడ్డాను. అంత మంచి కథ ఈ సినిమాలో ఉంటుంది. అలాగే నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్‌ ఇచ్చారు. నేను అన్ని భాషల్లో కలిపి 600 సినిమాల దాకా చేశాను. ఈ సినిమా నటుడిగా నాకు ఎంతో సంతఅప్తినిచ్చింది. డైరెక్టర్‌ సెబాస్టియన్‌ కు సినిమా అంటే ప్రాణం. నాకు ఆయనలో డైరెక్టర్‌ టి. కఅష్ణ కనిపించారు. అంత డెడికేషన్‌ తో వర్క్‌ చేశారు. అలాగే రక్షిత్‌ కూడా. సినిమానే లైఫ్‌ గా భావిస్తాడు. ఈ సినిమాతో యాక్షన్‌ హీరోగా రక్షిత్‌ పేరు తెచ్చుకుంటాడు. మంచి సినిమా ఇది మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
హీరో రక్షిత్‌ అట్లూరి మాట్లాడుతూ - మాకు సపోర్ట్‌ చేసేందుకు వచ్చిన నాగశౌర్యకి థ్యాంక్స్‌. మరో పది రోజుల్లో మా ''నరకాసుర'' సినిమా మీ ముందుకు రాబోతోంది. 2 గంటల 10 నిమిషాల సినిమా మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మా సినిమాలో ఎంటర్‌ టైన్‌ మెంట్‌, అద్భుతమైన విజువల్స్‌, సూపర్బ్‌ మ్యూజిక్‌, మంచి కథ ఉన్నాయి. సినిమా చూశాక మేము చెప్పింది నిజం కాదని మీకు అనిపిస్తే మీ టికెట్‌, పాప్‌ కార్న్‌ డబ్బులు తిరిగి ఇస్తాం. మేము ''నరకాసుర'' సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాం. ప్రతి టెక్నీషియన్‌ కంప్లీట్‌ ఎఫర్ట్‌ తో పనిచేశారు. వాళ్లందరికీ థ్యాంక్స్‌. మా డైరెక్టర్‌ లైఫ్‌ లో ఎంతో సాహసం ఉంది. ఆయన లైఫ్‌ ను బయోపిక్‌ చేయాలని ఉంది. మా సినిమా ట్రైలర్‌ ను బోయపాటి గారి సినిమాలా యాక్షన్‌ మూవీ అనిపించేలా కట్‌ చేశారు. కానీ చాలా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుంద. ప్రతి క్యారెక్టర్‌ కు ఒక ఆర్క్‌ ఉంటుంది. అలా అన్ని పాత్రలను డిజైన్‌ చేయడం అంత ఈజీ కాదు. ఇది నరకాసురుడిని పాజిటివ్‌ గా చూపించే సినిమా కాదు. పురాణాల్లోని నేపథ్యాన్ని తీసుకుని ఈ సినిమాకు ఆ పేరు పెట్టలేదు. టైటిల్‌ కు, కథకు ఉన్న సంబంధం మీరు సినిమాలోనే చూడాలి. నవంబర్‌ 3న థియేటర్‌ లో ''నరకాసుర'' చూడండి' అని అన్నారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ''నరకాసుర'' సినిమా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. రక్షిత్‌ నాకు చైల్డ్‌ హుడ్‌ ఫ్రెండ్‌. వాడికి నడక రానప్పుడు ఎత్తుకునేవాడిని. బై బర్త్‌ వాడు రిచ్‌. సినిమాల్లోకి వస్తున్నాడు అన్నప్పుడు డబ్బుంది కదా సినిమాలు చేస్తాడు అనుకున్నాను. కానీ డబ్బు కాదు రక్షిత్‌ కు సినిమాల మీద ఎంతో ప్యాషన్‌ ఉంది. వాళ్ల నాన్నగారికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. వీళ్లు ఒక మంచి సినిమా చేయాలనే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. పలాస సినిమా చేసినప్పుడు వెళ్లి చూశా. ఆ సినిమా అటెంప్ట్‌ చేయడం అంత ఈజీ కాదు. డైరెక్టర్‌ సెబాస్టియన్‌ గారి గురించి చాలా మంచిగా వింటున్నాను. సినిమా ఫ్లాప్‌ అయిన తర్వాత చాలా మంది ఎన్నో రీజన్స్‌ చెబుతారు కానీ సెబాస్టియన్‌ గారికి పెద్ద యాక్సిడెంట్‌ అయి చేయి కోల్పోయినా ఎంతో పట్టుదలగా సినిమా పూర్తి చేశారు. హ్యాట్సాఫ్‌ సార్‌. రక్షిత్‌ ఆర్డినరీ మూవీస్‌ చేయడు. కొత్త కథలు, రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీస్‌ చేస్తాడు. తమిళం,మలయాళంలో మనం అలాంటి మూవీస్‌ చూస్తాం. ఇప్పుడు తెలుగులో రక్షిత్‌ చేస్తున్నాడు. అతన్ని ఎంకరేజ్‌ చేద్దాం ' అని అన్నారు.