ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నందవరం అజయ్ బాబు బుధవారం బాధ్యతలను చేపట్టారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కమిటీ చైర్మన్ ఎస్.ఎం.డి కరీం, ముస్లిం మైనారిటీ నాయకులు ముజఫర్ అహ్మద్, ఎస్.జి ఇనాయతుల్లా, రహిమాన్, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అజయ్ బాబును సాదరంగా ఆహ్వానించి పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అజయ్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని విద్యా-బుద్ధులు నేర్చుకోవాలని అన్నారు. కళాశాల అధ్యాపక బందం సమిష్టిగా ఐకమత్యంతో కృషి చేసి ఈ ఏడాది సార్వత్రిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి కళాశాలను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు.