Oct 23,2022 08:10

నవ్వుతూ నువ్వు గీసిన పిచ్చిగీతలే
ఇప్పుడు గాయపు గుర్తులయ్యాయి

చెరపవీలుకానంతగా ఉన్న
ఈ చెరసాల గాయలు
రోజుకో రంగుని చూపిస్తూ
నాతో నలుపు హోలీ ఆడుతున్నాయి

గుండె స్రవిస్తున్న ద్రవానికి
పేరేంటోగానీ
మహా చెడ్డది
నా అనే నన్నే,
నా జ్ఞాపకాల గదిలోంచి ఖాళీ చేయించింది
దాని రంగేంటో
చెమర్చిన కళ్ళకి అస్సలు కనబట్టమే లేదు

చిన్నప్పటి ఏడుపు ఎదురుచూపులకైతే
ఇప్పటి దుఃఖం
ఎవరి చూపులనూ తాకంది
ఎదురుగా కన్నీళ్లు కదిలొస్తే
కొన్ని జతల కళ్ళకి కన్నులపండుగే కదా!

నిజాల నివృత్తికై కదిలిన కాలాన్ని
అంధకారం అందంగా అలంకరించుకుంది.

అక్కడక్కడా దొర్లిపడిన సంఘర్షణ తాలూకు కన్నీళ్లు.
వాటికి ఎప్పుడూ ముఖం కొత్తగా, గాయమూ కొత్తదే.

మతిమరుపు మనసుకి గుర్తేలేదు...
ప్రతిగాయానికీ
సమూహపు కన్నీళ్లుంటాయనీ,
ఒక్కసారి దెబ్బ తగలగానే
వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతాయని!

- వరలక్ష్మి
Vamshikrishnabolle223@gmail.com