అప్పుడప్పుడూ నేను
చైతన్యపు కెరటమై
కాలం రెక్కలపై
విహరిస్తుంటాను
తొలిపొద్దు కిరణానికి
తూనీగ రెక్కనై
వాలిపోతుంటాను
మిడిసిపడే చీకటి
అలల చాటున
మిణుగురునై తేలిపోతుంటాను
చరిత్ర పుటల
చివరి పేజీ కోసం
శ్రమ విహాంగమై
చక్కర్లు కొడుతూనే ఉంటాను
మనిషి, మనిషిని మరచాక
మానవత్వపు చాయల కోసం
ఆశల అంతరంగమై నిల్చొంటాను
శ్రమ జీవుల
శ్రమ దోపిడీ కడగండ్లకు
ఎర్ర భావుటానౌతాను
వారి కలల సాఫల్యం కోసం
మరో ఉదయాన్నౌతాను
అందరి ఉనికి కోసం
అక్షరాన్ని అవుతాను
సమసమాజ స్థాపన కోసం
సంఘీభావపు తోరణమవుతాను
నాలోకి నేను అగ్నికణమై
రగులుతూనే ఉంటాను...!!
మహబూబ్ బాషా చిల్లెం
9502000415