పెదనందిపాడు (గుంటూరు) : గుంటూరు వాహిని కాలువ పొడిగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ... మంగళవారం ఉదయం రైతులు చేపట్టిన రైతుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. నిధుల విడుదల కోసం సిఎం జగన్‌ను కలవాలని రైతులు నిర్ణయించి నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుయాత్రకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా పెదనందిపాడు నుంచి యాత్రగా వెళ్లేందుకు రైతులు సిద్ధమవ్వగా, అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు రైతు నేతలను గృహనిర్బంధం చేశారు. పెదనందిపాడు, నాగులపాడు, వరగాని, ప్రత్తిపాడు, ఏటుకూరు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, లారీల్లో పోలీసులు తనిఖీ చేశారు. చిలకలూరిపేట-పర్చూరు రహదారుల్లో వాహనాల తనిఖీ చేపట్టారు. అనంతరం పలువురు రైతులను అరెస్ట్ చేసి పెదనందిపాడు పీఎస్‌కు తరలించారు.










