Oct 18,2023 19:07

కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, హీరో నాగార్జున సోదరి నాగ సరోజ మంగళవారంనాడు తుదిశ్వాస విడిచారు. సుశాంత్‌ తల్లిగా నాగ సుశీల తెలిసిందే. ఆమె సినిమా రంగానికి దూరంగా ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావుకి సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్‌, నాగార్జున ఇలా ఐదుగురు సంతానం. అందులో ఇప్పుడు నాగ సరోజ కన్నుమూశారు. సత్య వతి చాలా ఏళ్ల క్రితమే మృతిచెందారు. నాగ సరోజ అనారోగ్యంతో చనిపోయారు. సత్యవతి ముంబైలో చనిపోయిన విషయం తెలిసిందే.