Jul 30,2023 08:14

రాయగలిగితే
రాయి నా కథ
కానీ రాయటం నీ వల్ల కాదు
ఎందుకంటే - నేను జీవితాన్ని!
అందరూ జీవిస్తారు.. అయినా
దీనికి చెప్పలేక పోయారెవరూ నిర్వచనం
భరించగలిగితే
భరించి చూడు నా లాగ
కానీ భరించలేవు నువ్వు
నాలా అత్యాచారాల బాధని
నిజమే నేను ప్రేమని చూశాను
దానితోబాటు ద్వేషాన్నీ చూశాను
నువ్వు నన్ను కూర్చోబెట్టావు
చందమామ మీద
కానీ పాతాళం కన్నా లోతైన
నరకంలోకి కూడా నెట్టేశావు
అయినప్పటికీ
నీకు నా అవసరం ఉందని
తెలిసినప్పుడల్లా
వస్తాను నీ దగ్గరకు
ఎన్నో రూపాలలో !

హిందీ మూలం: అంజనా వర్మ
తెలుగు అనువాదం : ఆర్‌. శాంతసుందరి