నేను ఇప్పటికిప్పుడే
అక్కడికి చేరుకోవాలి
కథ మొదలవుతోంది.
మతం బట్టలు విప్పి
మనిషి జన్మస్థానాన్ని
ఊరేగిస్తోంది.
దేశం సిగ్గు మడి తడవట్లేదు.
మరో మతపు గాయం
ఆ నగదేహాలపై
ప్రవహిస్తోంది
చూపుల శూలాలు
ఎగబడి దిగబడుతోంటే.
ఇక్కడకి వెళతానన్నది
ఊసుపోక కాదు
ఆ మానాల కొలతలను
చూడ్డానికి అంతకన్నా కాదు.
నా ఎద దుఃఖపు
ఎడారిలోని మానవత్వానికి
దారి చూపాలని..
నేనింకా ఎప్పుడూ కచ్చితంగా
అక్కడే ఉంటాను.. ఉంటాను..
మతం మానాన్ని దర్శించదని
మనిషి ద్వేషాన్ని త్యజించమంటుందని
ఈ అక్షరాలతో చాటింపు వేస్తాను
- కొత్తపల్లి మణీత్రినాథరాజు
79978 26662