Jan 01,2023 08:10

గాలి వానకు
మట్టి గోడలు కూలినట్టు
భూకంపం వచ్చి
భూమి చీకలినట్టు
ఎందరి మాన ప్రాణాలు
శిధిలమై పోతున్నయో కదా
ఇవన్నీ నీవల్లే...?

మాటకు విలువ లేదు
మనిషికి మర్యాద లేదు
ముఖాన చిరునవ్వు లేదు
బతుకులకు భరోసా లేదు
ఇవన్నీ నీవల్లే...?

బతుకులు సాగలేదు
ఆకలి తీరలేదు
చదువులు సాగలేదు
సంపద లేనే లేదు
ఇవన్నీ నీవల్లే...?

నాలుగు గోడలమధ్య
ఎన్ని కన్నీళ్లో
ఎన్ని రోదనలో
ఎన్ని రుగ్మతలో
ఇవన్నీ నీవల్లే...?

నువ్వు బాధ్యత మరవగ
వచ్చిన కష్టాలే ఇవన్నీ
ఒక్కసారి మనసుపెట్టి
ఆలోచించ కూడదు
నీ బాధ్యత గూర్చి
నీ గూర్చి నిన్ను
నమ్ముకొన్న నమ్మకాల గూర్చి
...
సంతోషాలు అయిన
దుఃఖాలు అయిన
అన్నీ ''నీవల్లే''

లక్ష్మీ శ్రీనివాస్‌
9676601182