Oct 11,2023 19:05

ఇజ్రాయేల్‌-హమాస్‌ యుద్ధంలో తన సోదరి, ఆమె భర్తను. వారి పిల్లల ముందే దారుణంగా చంపేసినట్లు బుల్లితెర నటి మధురా నాయక్‌ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడిలో చాలామంది బంధువులను కోల్పోయాను. వారందరి ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈనెల ఏడోతేదీన జరిగిన దాడిలో నా సోదరిని, ఆమె భర్తను వారి పిల్లల ముందే దారుణంగా చంపేశారు. ఉగ్రవాదుల అరాచకాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. పట్టపగలే మహిళలు, పిల్లలు, వృద్ధులను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం దయచేసి అందరూ ప్రార్థించండి' అంటూ ఎమోషనల్‌ వీడియో పోస్ట్‌ చేశారు. తన సోదరి కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు. మధురా నాయక్‌ బాలీవుడ్‌లోని నాగిని సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.

బాంబు శబ్ధాలు విని నిద్ర లేచా: నుస్రత్‌ భరూచా
మరోవైపు హైఫా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌ వెళ్లి అక్కడ చిక్కుకున్న బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరూచా సురక్షితంగా భారత్‌కు తిరిగొచ్చారు. అక్కడ ఆమెకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు.