'క్రికెట్ నేపథ్యంలోనే నా తర్వాతి కథ ఉండనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లిని స్ఫూర్తిగా తీసుకుని పాత్రలు క్రియేట్ చేస్తున్నా. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే ఇద్దరు స్నేహితుల కథగా దీనిని తీర్చిదిద్దనున్నా' అని గౌతమ్ మేనన్ అంటున్నారు. 'ధ్రువ నక్షత్రం' సినిమా ప్రమోషన్లలో పాల్గంటున్న ఆయన ఓ కార్యక్రమంలో తాను చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌లపై మాట్లాడారు.