తియ్యని గాయమెందుకో
క్షణము ఎడబాటుకే
యుగాల కలవరపాటు దేనికో
జగమంతా మనమేలిన
జ్ఞాపకాల గట్టిదనం
విశ్వమంతా వినిపించిన
మన నవ్వుల చిక్కదనం
వానలాగా రాలిపడి
చిరుగాలై కనుమరుగైతే
కాలపు జల్లుల్లోనా
కాగితపు పడవలము
దారి చూపని తీరానికి
పయనమై సాగినాము
సుడిగుండం రాకముందే
చెల్లాచెదురై మిగిలితే
అమర స్నేహం మనది
ఆశయ సాధనలోనా
రేపటి పొద్దును అందంగా
తీర్చిదిద్ద కదిలినాము
కాలచక్రంలోనా కలుసుకునే
దారిలోనే మనమున్నా గానీ
అమృతరాజ్
95050 94032