- చికిత్స పొందుతున్న తల్లి, మరో చిన్నారి
ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం జిల్లా) : భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి.. ఆపై తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఓ చిన్నారి మృతి చెందగా..మరో చిన్నారి, తల్లి చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులు, పోలీసుల సమాచారం మేరకు... టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన దంపతులు అంబటిఅనిల్, అనూషకు ఇద్దరు సంతానం ఉన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన అనిల్ తన భార్యను నిత్యం వేధించేవాడు .భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మంది తినిపించి, ఆపై తాను తిన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి, అనూష గుంటూరులో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










