Jul 27,2023 13:03

ఇంటర్నెట్‌డెస్క్‌ : వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువ. జలుబు, జ్వరాలు వంటివి త్వరగా సోకుతాయి. దోమలు, నీరు, గాలి మార్పుల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలే కాకుండా.. శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తే అవకాశముంది. చర్మవ్యాధులు గురించి ఇక చెప్పక్కర్లేదు. మరి ఈ సీజన్‌లో వ్యాధుల నుంచి రక్షించుకోవాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి. బలమైన రోగనిరోధక శక్తి వ్యవస్థనే ద్వారానే వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు వీలుంటుంది. మరి ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి విషయాల్లోకి వెళితే..
- ఉడికించిన వేరుశనగల్ని, మొక్కజొన్నల్ని తింటే ఆరోగ్యానికి మంచిది.
- వర్షాకాలంలో దోసకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయల్ని తీసుకుంటే మంచిదని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఆహారంలో చామదుంపల్ని చేర్చుకున్నా ఎంతో మంచిది. వీటిని ఉడికించి, ఉప్పు, కారం కలిపి ఫ్రైగా చేసుకుని తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. జొన్నలతో చేసే పదార్థాలేవైనా ఈ కాలంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- ప్రధానంగా ఈ కాలంలో ఆకుకూరల్లో గోంగూర తింటే మంచిదని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. స్ట్రీట్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.