Oct 12,2023 19:01

'నేను సుల్తాన్‌ ఆఫ్‌ దిల్లీ'లో నాలుక్‌ని ఇష్ట పడ్డాను. ఆ కాలంలో జుట్టు రంగు అంతగా ప్రాముఖ్యం లేదు. అందుకే జుట్టుకు కలర్‌ వేయడానికి బదులుగా విగ్‌ ధరించాను. 50, 60ల నాటి దుస్తులే ఎంతో కూల్‌ లుక్‌ని ఇచ్చాయి. ఇది ఆడ్రీ, మార్లిన్‌ మన్రోలచే ప్రేరణ పొందింది. నేను వాళ్ల సినిమాలను చాలా వరకు చూసినందున ఇది నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. లిప్‌ కలర్స్‌, బూట్లు వంటివి మిలన్‌కు ఓ పట్టాన నచ్చలేదు. ఎంతో అమాయకత్వంతో ఉండే సంజన వంటి పాత్రకు తటస్థ రంగులు, సహజమైన మేకప్‌ ఉన్న బాగా సరిపోతాయని ఆయన గ్రహించారు. అందుకే బేస్‌ ఎంతో సింపుల్‌గా ఉంది, ఫ్యాషన్‌గా కూడా ఉంది' అని నటి మెహ్రీన్‌ పిర్జాదా అన్నారు. 1960ల నాటి ఢిల్లీలో అధికార దాహం కథతో డిస్నీ హాట్‌స్టార్‌లో 'సుల్తాన్‌ ఆఫ్‌ దిల్లీ' సిరీస్‌ రానుంది. అర్నాబ్‌ రే రచించిన 'సుల్తాన్‌ ఆఫ్‌ దిల్లీ అసెన్షన్‌' పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. మిలన్‌ లుత్రియా దర్శకత్వం వహించారు. గురువారం విడుదల కానుంది. ఈ ధారావాహికలో తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, అంజుమ్‌ శర్మ, ప్రముఖ నటుడు వినయ్ పాఠక్‌తో పాటు నిశాంత్‌ దహియా, అనుప్రియ గో యెంకా, మౌని రాయ్, హర్లీన్‌ సేథీ నటించారు.