Aug 28,2022 09:32

ఎన్నాళ్లని
నీ గీతాన్ని
నేను మోస్తూ
తిరగను.

పిట్టలు
వేకువను
ముక్కున కరచి
దిగంతాలకు ఎగురుతూ
తారసిల్లాయి.

నది
వెలుతురై పారుతూ
పచ్చికను పల్లవిస్తుంది.

తూర్పును
వెలిగించారెవరో
రగిలే పాటను
నీకు టపా పంపాను
బట్వాడా అయిందా..

గువ్వలు
పాడుతున్నాయి
దాడిమలు పుష్పించాయి

అలలు కడిగిన
తీరంలోని తడి ఇసుకలా
జీవితమా..
నీ సంతకం కొరకే
నిరీక్షిస్తున్నా...

గరికపాటి మణీందర్‌
99483 26270