
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కి సిట్ జారీ చేసిన నోటీసులపై స్టేను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఇదే కేసులో కేరళకు చెందిన జగ్గుస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఈ నెల 13వ తేదీ వరకు స్టేను విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో బీఎల్ సంతోష్ సిట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 5వ తేదీ వరకు స్టే ఇచ్చింది. ఇవాళ్టితో స్టే ముగియనుంది. దీంతో ఇవాళ ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. బీఎల్ సంతోష్‌కు సిట్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది.