Oct 30,2023 12:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లా సర్వజన ఆసుపత్రిలో క్షత్రగాతులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆసుపత్రి బయట మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ... కంటకపల్లి లో జరిగిన రైల్వే ఘటన దురుదఅష్టకరమన్నారు. సంఘటన ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగితే 7.30 గంటలకే తాము అక్కడికి చేరుకున్నామన్నారు. ఆసుపత్రి లో 29 మంది కి వైద్యం అందుతుందని తెలిపారు. అందులో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందని వారికి అన్నివిధాలా వైద్యం అందే విధంగా వైద్య శాఖా అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. అదే విధంగా రైల్వే ప్రమాదంలో 13 మంది చనిపోయారని తెలిపారు. వారిలో ఒకరు రైల్వే ఉద్యోగి కావడం వలన రైల్వే శాఖ వారి స్వాధీనంలో ఉండగా, మరో 12 మంది మఅతదేహాలు జిల్లా సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చామన్నారు. వాటిలో 6 మఅతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందన్నారు. ఆయా మఅతదేహాలను వారి కుటుంబాలకు అందిస్తామని తెలిపారు. రైల్వే ఘటన జరిగిన తర్వాత ప్రతి గంట గంటకు ముఖ్యమంత్రి సమాచారం అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు తమకు ఆదేశాలు ఇస్తూ సహాయ చర్యలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరణించినవారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, చిన్న చిన్న గాయాలు తగిలిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రయాణికులను ఆర్టీసి బస్సు లు ద్వారా వాళ్ళ ఇళ్లకు చేర్చామన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారని తెలిపారు. మంత్రి బొత్స వెంట డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి,జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు,జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి,ఎస్పీ దీపికా పాటిల్‌, ఎమ్మెల్యే అలజంగి జోగారావు,ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజూ లు ఉన్నారు.