Nov 05,2023 14:13

క్లిస్టర్‌ క్లియర్‌ వాటర్‌కు, అద్భుతమైన బీచ్‌లకు పేరుగాంచిన దేశం మాల్దీవులు. తెల్లని బీచ్‌లు ప్రపంచంలోనే ఐదు శాతం మాత్రం ఉంటాయి. వాటిలోకొన్ని ఇక్కడ ఉన్నాయి. మాల్దీవులు అంటే 1200 దీవుల సముదాయం. ఇక్కడ 200 దీవులు మాత్రమే టూరిజానికి కేటాయించారు. మిగతా 110 దీవుల్లో వ్యవసాయం, చేపలు పట్టడం లాంటివి చేస్తారు. ప్రపంచంలోనే ఫ్లాటెస్ట్‌ దేశమిది. సముద్రమట్టానికి కేవలం రెండుమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటాయివి. సముద్రమట్టం పెరిగితే మునిగిపోయే అవకాశాలెక్కువ. అందుకే పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలెన్నో తీసుకుంటారు. ఇక్కడ సూర్యకిరణాలు 90 డిగ్రీల కోణంలో పడతాయి. సముద్రం లోపల ఉండే పలురకాల అరుదైన తాబేళ్లను చూడటానికి పర్యాటకులు ఇష్టపడతారు. ఈ దేశానికి నేషనల్‌ ట్రీ- కొబ్బరి చెట్టు. ప్రస్తుతం తొంభైశాతం ఆర్థికాభివృద్ధి ఈ దేశానికి టూరిజం ద్వారానే వస్తోంది. ఇక్కడి అండర్‌వాటర్‌ లైఫ్‌ను చూడటానికే ప్రపంచంలోని నలుమూలల నుంచి వస్తారు. రకరకాల చేపలు, షార్క్స్‌, తాబేళ్లకు పెట్టింది పేరు. ఇక్కడ 5 లక్షల 67 వేల మంది ప్రజలు ఉన్నారు. సిటిజన్‌ షిప్‌ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటుంది ఈ దేశం. ఈ దేశాన్ని సుల్తాన్‌లు పాలిస్తున్నారు.