Oct 01,2023 13:43

వాన రాక కోసం
ఎదురుచూసిన కళ్ళు
మళ్ళీ కాయలు కాస్తూ
కన్నీరు కురుస్తోంది
కొన్నాళ్ళు మురిపించిన మేఘం
ఇప్పుడు జాడలేక.. జరంత..
రైతు వెన్నులో వణుకు మొదలైంది
నిస్సహాయస్థితి నిప్పులా దహిస్తోంది
వేరుశెనగ ఎండి
రైతు మది మండుతోంది
నారుమడి నీరు లేక
వాడి వగుస్తోంది
ఆశించిన పంట కలలు కల్లలై
రైతు కంట కన్నీరై కురుస్తోంది
రైతు గుండెకు
దిటవునివ్వని మేఘం
వలస బాటను చూపిస్తోంది
బతుకుని ఏ అరచేత పట్టుకొని
ఏ పట్నం పోవాలో..!
వలసెల్లిన వానని చూస్తూ
ఎన్ని పల్లెల అడ్రస్సులు
గల్లంతవుతాయో..!
హతవిధీ ..!!
 

మహబూబ్‌ బాషా చిల్లెం
9502000415