May 13,2023 22:00

మెక్సికో సిటీ : మెక్సికన్ల వలసలపై అమెరికా రాజకీయ నేతలు చేస్తును ప్రకటనలు చాలా దారుణంగా వుంటునాుయని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ తీవ్రంగా విమర్శించారు. అహంకారంతో వ్యవహరించే అమెరికా ప్రతినిధులకు ఓటు వేయద్దని స్పానిష్‌ మాట్లాడే ప్రజలను కోరారు. ఈ రీతిన వ్యవహరించడం వల్ల వారికి ఒరిగేదేమీ లేదని అనాురు. మెక్సికో సిటీలోని నేషనల్‌ ప్యాలెస్‌ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల రిపబ్లికన్‌ సెనెటర్‌ జాన్‌ కెనుడీ చేసిన ప్రకటనను ఒబ్రాడర్‌ ఖండించారు. ''అమెరికా మద్దతు లేకుండానే మెక్సికో పిల్లిలా ఆహారానిు తినేస్తోంది,'' అని కెనుడీ వ్యాఖ్యానించడానిు ఆయన విమర్శించారు. కెనుడీ చాలా అహంకారం గల వ్యక్తని మెక్సికో విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. మెక్సికో, అమెరికా మధ్య సరిహద్దు గోడ నిర్మాణానిు పూర్తి చేయడంతో సహా సరిహద్దు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు గురువారం ప్రతినిధుల సభలో బిల్లును ఆమోదించారు. వచ్చే ఏడాది ఎనిుకలను దృష్టిలో వుంచుకునే ఇదంతా చేస్తునాురని విదేశాంగ మంత్రి ఎబ్రార్డ్‌ విమర్శించారు. ఇటువంటి ఆలోచనలనిుంటికీ మూలం మెక్సికన్లు, స్పానిష్‌ మాట్లాడేవారికి వ్యతిరేకంగా అమలు చేసే వర్ణవివక్షేనని ఆయన విమర్శించారు.