ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : మేడే దినోత్సవ వేడుకల్లో అంగన్వాడీలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పెద్దాపురం ప్రాజెక్టు కార్యదర్శి దాడి.బేబీ పిలుపునిచ్చారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో మంగళవారం యూనియన్ అధ్యక్షులు పుప్పాల సావిత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం, ఉపాధి వర్గం మేడే స్ఫూర్తితోనే పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకున్నారన్నారు. అదే స్ఫూర్తితో అంగన్వాడీలు కూడా మే డే వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాసలపు సూర్యారావు భవనం నుండి ప్రారంభమయ్యే ప్రదర్శనలో అంగన్వాడీలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మామహేశ్వరి, రమణమ్మ, చక్రవేణి, సత్యనారాయణమ్మ, మార్త తదితరులు పాల్గొన్నారు.










