ఆకలి కోసం పరుగులు
దారెటో దూరమెంతో
శ్రమకు కట్టుబానిసలుగా
పల్లెలు పట్టణాల్లో అంతటా
బాల కార్మికులు.. వృద్ధులు
ఆడ మగ అన్న తేడా లేదు
కండలు కరిగించే కూలీలు
పొయ్యి మీద కుండలో
కుత కుతలు శబ్దంతో
ఐదేళ్ళు నోట్లోకెళితే
ఏపూట కాపూట పండగ
ఒంటి నిండా కట్టేబట్ట లేదు
ఆకలితీరా తినే తిండి కరవు
అలసట తీరా నిద్ర ఆశ లేదు
ప్రతి యేడూ మన ప్రభుత్వాల
మే డే వాగ్దానాలు భలే జోరు!
-పేరూరు బాలసుబ్రమణ్యం
98492 24162