చెప్పేది ప్రజాస్వామ్య నీతులు...
చేసేది ధనస్వామ్య చేతలు
భిన్నత్వంలో ఏకత్వంలా కలిసిమెలిసి
జీవిస్తున్న మతాల మధ్య మత ఘర్షణలు..
మారణహోమం సృష్టించటానికి
లౌకిక భారతదేశాన్ని 'హిందూత్వ' రాష్ట్రంగా
మార్చేందుకు ఆర్ఎస్ఎస్ పథకం
'ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం' పేరుతో
ముస్లింలను ఒంటరి చేయటమే అసలు కుట్ర
దానికి ఆయుధం యుసిసినే
మత విశ్వాసాలు.. సామాజిక న్యాయం,
జీవనశైలి, సాంస్కృతిక విభేదాలతో
వ్యక్తిగత చట్టాలు, హక్కులు,
కుటుంబ సంబంధాల నిర్ణయం
వాటి విచ్ఛిన్నానికే కేంద్రం కంకణం
అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం
కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే లక్ష్యం
ఏకరూప పౌరస్మృతి కోసమే ఆరాటం
ఆర్ఎస్ఎస్ ప్రణాళికతో వచ్చే ఎన్నికలే లక్ష్యం
- యడవల్లి శ్రీనివాసరావు,
949099214