- కళాకారుల 'ధూంధాం' ప్రారంభం
ప్రజాశక్తి - విజయవాడ : ప్రజల సమస్యల పరిష్కారానికి మార్క్సిజానికి మించిన సిద్ధాంతం ప్రపంచంలో మరొకటిలేదని ప్రముఖ కళాకారుడు, ప్రజాకవి, ఎంఎల్‌సి గోరటి వెంకన్న అన్నారు. సిపిఐ 24వ జాతీయ మహాసభ నేపథ్యంలో గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆట, పాట, మాట 'ధూమ్ ధామ్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 17వ తేదీ వరకు జరిగే కళాకారుల ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని గోరటి వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో ''సఅష్టిలో సంపద ఎవరి ద్వారా వస్తున్నది, ఈ సంపదకు యజమానులెవరు'' అన్న అంశాలను పాటల ద్వారా సబితలను ఉత్తేజపరిచారు. ప్రశ్నించేతత్వం ఒక్క కమ్యూనిస్టులకే ఉంటుందన్నారు. అలాంటి వారిపై మనువాద శక్తులు అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు ఎర్రజెండా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఇంకా పలువురు కళాకారులు తమ ఆట పాటలతో ఆలోజింపచేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎంపి వినరు విశ్వం. జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకఅష్ణ ఇన్చార్జి గుజ్జుల ఓబులేసు, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఇన్చార్జి పిజె.చంద్రశేఖర రావు తదితరులు పాల్గన్నారు. ఎపిపిఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య స్వాగతం పలకగా, అధ్యక్షులు పి చంద్ర నాయక్ అధ్యక్షత వహించారు.










