జ్ఞాపకాల పుటల్లోకి
మరో వసంతం జారిపోయింది
మారని బతుకుల్ని
జాలిగా చూస్తూ
మానని గాయాలకు
వెన్న పూస్తూ
తొలి పొద్దు పొడిచింది
ఎప్పటిలాగానే
అయినా
ఎన్నెన్నో ఆశల్నీ, ఆశయాల్నీ
మోసుకొస్తూ..
ఏమిటో
నిన్నటికి ఈరోజుకి ఈ తేడా ?
అవును
మానవుడు ఆశల శ్వాసల్లోనే జీవిస్తూ
నిన్నటి అనుభవాల వారధిపై
రేపటి గమ్యానికి
నేడు మొదలెట్టిన ప్రయాణం ఇది
తరాలు మారుతున్నా
బతుకులు మారకున్నా
రాబోయే రోజుల్లో
నేనే రారాజుననుకుంటూ
కొత్త వసంతాన్ని స్వాగతిస్తూ
మరో పాత జీవితం.
యం యస్ రాజు
9502032666