Apr 09,2023 07:57

అమ్మ పాలు వదిలి
అమ్మకం పాలు రుచి చూచినప్పుడే
అమ్మ భాషను
మరచి ..
అమ్మకం భాషకు బానిస అయ్యారు?
స్వేచ్చగా తెలుగు భాషను
మాట్లాడ్డానికి మొహం చాటేసుకుంటు
బడాయి భాషను బ్రతికస్తూ
గొప్పగ బ్రతుకుతున్నామని
అనుకొంటున్నారు కాని
బ్రతుకంతా బానిసేనని మర్చిపోయారు !!

నేడు పరాయి భాష కోసం
ప్రాకులాడుతున్న వాళ్లంతా
విదేశాలకు పారిపోయి
కన్న వాళ్ళను అనాధలుగా చేసి
వాళ్ళ కన్నీటికి కారణమవుతున్నారు
తెలుగు జాతి ఆత్మ గౌరవానికి
తెలుగు భాష మనుగడకు
భంగం చేకూరుస్తున్నారు
చీకటికి వెలుగు కరువైనట్టు
తెలుగుకి తెలుగు వాడు మరుగౌతున్నడు!!

పెద్ద పెద్ద చట్ట సభలలో
సూటు బూటు వేసుకొని
అర్ధం కాని పదాలతో
ఫ్యాషన్‌ ఫ్యాషన్‌గా
ప్లాస్టిక్‌ నవ్వుని మొకానికి తగిలించుకొని
మైకుని అటుతిప్పి ఇటుతిప్పి
నాలుగు మాటలు మాట్లాడి
మురిసి పోతున్నారు ..
మతిహీనులై మాతృ భాష ద్రోహులై
మాతృభాషను మరిచిపోతున్నారు ?

లక్ష్మీ శ్రీనివాస్‌
9676601192