Sep 28,2023 14:37

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్ళను రద్దు చేస్తునట్టు రైల్వే శాఖ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి తెలిపారు. 07466 రాజమండ్రి-విశాఖపట్నం ప్యాసింజర్‌ స్పెషల్‌, 07467 విశాఖపట్నం-రాజమండ్రి ప్యాసింజర్‌ ప్రత్యేక, 17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, 17219 మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ లని అక్టోబర్‌ 02 నుండి 08 వరకు రద్దు చేసారు. అదేవిధంగా 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, 17220 విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ లను అక్టోబర్‌ 03 నుండి 09 వరకు రద్దు చేశారు. 22702 విజయవాడ-విశాఖపట్నం ఉదరు ఎక్స్‌ప్రెస్‌, 22701 విశాఖపట్నం-విజయవాడ ఉదరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను అక్టోబర్‌ 2,3,4,6,7 తేదిలల్లో రద్దు చేశారు.

రైళ్ల దారి మళ్లింపు

13351 ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ ను అక్టోబర్‌ 1 నుండి 6 వరకు, అక్టోబర్‌ 8 వ తేదిన, 12889 టాటా నగర్‌-ఎస్‌ఎంవి బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 6వ తేదిన , 18111 టాటా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 5వ తేదిన, 12835 హతియా- ఎస్‌ఎంవి బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 1,3,8 తేదిలల్లోను, 12376 జసిదిV్‌ా-తాంబరం ఎక్స్‌ప్రెస్‌, అక్టోబర్‌ 4వ తేదిన, 22837 హతియా-ఎర్నాకులం ఏసీ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 2వ తేదిన సాధారణ మార్గం అయిన తాడేపల్లిగూడెం , ఏలూరు, విజయవాడ మీదుగా కాకుండా నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ , విజయవాడ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని అభ్యర్థించారు.