Oct 19,2023 19:15

ఏకంగా 36 సంవత్సరాల తర్వాత కమల్‌ హాసన్‌తో మణిరత్నం సినిమా చేయబోతున్నారు. కమల్‌ హాసన్‌ రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మల్టీ స్టారర్‌ చిత్రంగానే ఈ మూవీని సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటించనున్నట్లు తెలుస్తోంది. జయం రవి, దుల్కర్‌ సల్మాన్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని5 నెలల్లో పూర్తి చేయాలని మణిరత్నం ప్రణాళిక రూపొందించినట్లుగా సమాచారం. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసుకోవడం ద్వారా షెడ్యుళ్లను పూర్తిచేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పొన్నియన్‌ సెల్వన్‌ 2 షూటింగ్‌ కూడా 150 రోజుల్లోనే మణిరత్నం పూర్తి చేశారు.