Aug 04,2023 11:22

ఉంగుటూరు (ఏలూరు) : వ్యక్తి హత్యకు గురైన ఘటన శుక్రవారం ఉంగుటూరు మండలం నారాయణపురం టూరింగ్‌పేటలో జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్‌ (39) టూరింగ్‌పేటలోని అద్దె ఇంట్లో కింద పోర్షన్లో భార్య, ఇద్దపిల్లలతోఉంటున్నారు. చంద్రశేఖర్‌ నారాయణపురంలోని స్థానిక ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న చంద్రశేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని అతడి భార్య చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.